కలం, మధిర: కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల (Welfare Schemes) అమలులో కేవలం అర్హతే ప్రామాణికమని, ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావులేదని మధిర (Madhira) మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పారుపల్లి విజయకుమార్ (Parupalli Vijay Kumar) స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరా డైరీ పంపిణీలో కాంగ్రెస్ కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నేత పొన్నం వెంకటేశ్వరరావు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క లక్ష్యం పేదల అభ్యున్నతి, మహిళల ఆర్థిక స్వావలంబన అని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, పాడి పశువుల పంపిణీ పారదర్శకంగా అధికారుల సర్వే ఆధారంగానే జరుగుతోందన్నారు. పథకాల అమలులో ఎక్కడైనా అవకతవకలు జరిగాయని భావిస్తే ఆధారాలతో అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. నిరాధార ఆరోపణలతో ప్రజల్లో అపోహలు సృష్టించవద్దని కోరారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తలుపుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

