గ్వాటెమాలాలో ఘోర ప్రమాదం.. సరస్సులో కుప్పకూలిన హెలికాప్టర్!

కలం, వెబ్ డెస్క్: గ్వాటెమాలా (Guatemala) లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అట్లాటిన్ సరస్సులో ఒక హెలికాప్టర్ కుప్పకూలిన (Helicopter Crash) ఘటన చోటుచేసుకుంది. లా అరోరా అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన ఈ హెలికాప్టర్, ప్రయాణిస్తున్న సమయంలో ప్రతికూల వాతావరణం, భారీ వర్షం, తక్కువ విజిబిలిటీ కారణంగా అదుపుతప్పి సరస్సులో పడిపోయినట్లు తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్‌లో మొత్తం 7 గురు ప్రయాణికులు ఉండగా.. వారిలో 5 మందిని రెస్క్యూ టీమ్స్ ప్రాణాలతో రక్షించారు. అయితే పైలట్‌తో సహా మరో ఇద్దరు గల్లంతైనట్లు సమాచారం. ప్రస్తుతం సరస్సులో తీవ్రమైన గాలులు వీస్తున్నప్పటికీ సహాయక బృందాలు గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టాయి. గ్వాటెమాలా సివిల్ ఏవియేషన్ అథారిటీ ఈ ప్రమాదంపై పూర్తి దర్యాప్తు జరుపుతోంది. హెలికాప్టర్ సరస్సులో కూలిపోతున్న భయానక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>