సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి

కలం, కరీంనగర్: గన్నేరువరం మండలానికి సంబంధించి 27వ విడతలో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ (Kavvampally Satyanarayana) లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఖాసీంపేట గ్రామంలోని రైతు వేదికలో మండలానికి చెందిన 47 మంది లబ్ధిదారులకు బుధవారం మొత్తం రూ.21.09 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా కవ్వంపల్లి మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. అత్యవసర వైద్య ఖర్చుల సమయంలో ఈ సాయం కుటుంబాలకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.

వీవో భవనం ప్రారంభం..

గన్నేరువరం మండలం ఖాసీంపేట గ్రామంలో ఈజీఎస్ నిధులు రూ.10 లక్షలతో నిర్మించిన అపూర్వ మహిళా సమాఖ్య సంఘ భవనాన్ని (వీవో భవనం) ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం భవనాన్ని పరిశీలించిన ఆయన గ్రామీణ మహిళా సంఘాల కార్యకలాపాలకు ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే..

అనంతరం గన్నేరువరం మండలం నర్సింగపేటలోని ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, మౌలిక వసతులపై ఆరా తీశారు. విద్యార్థులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో మండల పరిషత్ ప్రత్యేక అధికారి సముద్రాల రామానుజాచార్యులు, ఇన్‌చార్జి ఎంపీడీవో వేమల సురేందర్, మండల తహసీల్దార్ ఇప్ప నరేందర్‌చారి, మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు సునీల్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముసుకు ఉపేందర్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ పులి కృష్ణ, స్థానిక సర్పంచ్ కర్నే చంద్రయ్య, ఉప సర్పంచ్ ఐలయ్య, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, పార్టీ నాయకులు కొమ్మెర రవీందర్‌రెడ్డి, జువ్వాడి మన్మోహన్‌రావు, అలవాల కోటి, మాతంగి అనిల్, అంతగిరి వినయ్‌కుమార్, పరిపూర్ణచారి, సంపత్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>