జ‌పాన్‌లో వినూత్న పోటీ.. నిద్ర పోతే ల‌క్ష‌ల్లో బ‌హుమ‌తి!

క‌లం, వెబ్‌డెస్క్: జ‌పాన్‌ (Japan) లో జరిగిన ఓ వినూత్న పోటీలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ పోటీలో పెద్ద‌గా క‌ష్ట‌ప‌డేది ఏం లేదు.. కంటి నిండా నిద్ర పోవ‌డ‌మే.. అలా ఎవ‌రు ఎక్కువ సేపు నిద్రపోతే వారే గెలిచిన‌ట్లుగా నిర్వాహ‌కులు ప్ర‌క‌టించారు. మ్యాట్ రేస్‌ (Matt Race) పేరుతో జ‌రిగిన ఈ నిద్ర పోటీల‌కు (Sleep Contest) సంబంధించిన వివ‌రాల‌ను కోలా స్లీప్ జపాన్ అనే మ్యాట్రెస్ సంస్థ వెల్లడించింది.

టోక్యోలో జరిగిన ఈ పోటీ(Sleep Contest)లో డజన్ల కొద్దీ నిద్రలేమితో బాధపడుతున్న కంటెస్టెంట్లు పాల్గొని, అతి తక్కువ సమయంలో గాఢ నిద్రలోకి వెళ్లేందుకు పోటీపడ్డారు. తలలకు మానిటర్లు అమర్చుకుని, కొందరు బొమ్మలను పట్టుకుని 90 నిమిషాల పాటు హాయిగా నిద్రపోయారు. ఈ పోటీలో వేగంగా, గాఢంగా నిద్రపోయిన సుయిమీ అనే వ్యక్తి విజేతగా నిలిచి సుమారు రూ. 12 లక్షలకు పైగా బహుమతిని గెలుచుకున్నారు.

అతి తక్కువ నిద్రపోయే దేశాల జాబితాలో జపాన్ ముందుంటుందని, అక్కడి ప్రజల సుదీర్ఘ పని గంటలు, ప్రయాణాల వల్ల నిద్రలేమి సమస్య తీవ్రంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ వినూత్న పోటీ ద్వారా ప్రజల్లో నిద్రపై అవగాహన పెంచడమే తమ ప్రధాన ఉద్దేశమని వారు పేర్కొన్నారు. పోటీ ముగిసిన తర్వాత పాల్గొన్న వారు మాట్లాడుతూ.. ఇది ఎంతో సంతోషకరమైన అనుభూతినిచ్చిందన్నారు. క్షణాల్లో సమయం గడిచిపోయిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇక పోటీలో గెలిచిన విజేత మాట్లాడుతూ.. బహుమతి మొత్తంతో తాను కొత్త ఇంటికి మారుతానని, ఒక మంచి మంచాన్ని కొనుక్కుంటాన‌ని తెలిపారు.

Also Read : ప్రజాసేవలో 25 ఏళ్లు.. ‘వికసిత్ భారత్’ సభలో మోదీ భావోద్వేగం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>