సీఎం విజయ్‌ను కలిసిన షర్మిల దంపతులు.. ఎందుకంటే?

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila), తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత సి. జోసెఫ్ విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి–సోమల రఘురామ్ రెడ్డిల వివాహ వేడుకకు సంబంధించిన పెళ్లి పత్రికను సీఎం విజయ్‌కు అందజేశారు.

కుటుంబ సమేతంగా ఈ వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని ఆయనను కోరారు. షర్మిల దంపతుల ఆహ్వానంపై విజయ్ ఎంతో ఆప్యాయంగా స్పందించి, కాబోయే నూతన జంటకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసినట్లు షర్మిల సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అంజిలి రెడ్డి వివాహం ఈ ఏడాది నవంబర్ 25న జరగనుండగా, డిసెంబర్ 5న రిసెప్షన్ నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>