కలం, వరంగల్: కరాటే పోటీల్లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించిన హనుమకొండ నయీమ్ నగర్ ప్రాంతానికి చెందిన కరాటే మాస్టర్ ధామేర శంకర్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత (CP Swetha) అభినందించారు. ఈ సందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ.. కఠోర సాధన, పట్టుదలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించడం అభినందనీయమని అన్నారు. ధామేరా శంకర్ (Karate Master Dhamera Shankar) సాధించిన ఈ ఘనత, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 16వ తేదీన చెన్నైలో నిర్వహించిన కరాటే పోటీల్లో నిరవధికంగా ఆరు గంటల పాటు ధామేర శంకర్ కరాటే ప్రదర్శన నిర్వహించారు.

