సుజాతనగర్‌‌లో రూ.15.33 కోట్లతో వసతుల విప్లవం!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ కేంద్రంలో రూ.15.33 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) మంగళవారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.10 కోట్లతో త్వరలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాల, తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవనాల నిర్మాణాలు చేపట్టి విద్యార్థుల చిరకాల ఆకాంక్షను నెరవేరుస్తామన్నారు.

​అలాగే 20, 21, 23 డివిజన్ల పరిధిలోని కోమటిపల్లి, నిమ్మలగూడెం, లక్ష్మీదేవిపల్లి తదితర ప్రాంతాల్లో రూ.5.33 కోట్లతో రోడ్లు, డ్రైన్లు, పార్కులకు సంబంధించిన 37 అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. మౌలిక వసతులు మెరుగుపరిచి కొత్తగూడెం కార్పొరేషన్ రూపురేఖలు మారుస్తామని చెప్పారు. ప్రజాధనం సద్వినియోగమయ్యేలా, నాణ్యతా ప్రమాణాలతో గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేయర్ మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్ లలిత, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, కమిషనర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>