ఇంట్లో నాగుపాము హల్‌చల్.. చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్!

కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని కాల్వగడ్డ బ్రహ్మపురి కాలనీలో సోమవారం అర్ధరాత్రి నాగుపాము కలకలం రేపింది. కాలనీకి చెందిన లక్ష్మీ అనే మహిళ ఇంట్లో రాత్రి 12 గంటల సమయంలో నాగుపాము కనిపించడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానిక వైఎస్సార్ నగర్ కాలనీకి చెందిన స్నేక్ క్యాచర్ షేక్ యాసిన్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకుని చాకచక్యంగా నాగుపామును పట్టుకున్నారు. అనంతరం దానిని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో నాగుపాము కనిపించడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ సమయస్ఫూర్తితో పామును పట్టుకోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>