గాజువాకలో ‘హార్వెంచర్’ స్కామ్: MD అరెస్ట్!

కలం, వెబ్ డెస్క్ : విశాఖపట్నం జిల్లా గాజువాకలో అధిక లాభాల ఆశ చూపి కోట్లాది రూపాయలు మోసం చేసిన భారీ డిపాజిట్ స్కామ్ (Harventure Scam) వెలుగులోకి వచ్చింది. రూ.లక్ష పెట్టుబడి పెడితే రోజుకు రూ.444 చొప్పున వరుసగా 500 రోజుల పాటు చెల్లిస్తామంటూ ‘హార్వెంచర్’ (Harventure) అనే సంస్థ విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. ఈ సంస్థ మోసపూరిత మాటలు నమ్మి పెద్ద సంఖ్యలో డిపాజిటర్లు తమ డబ్బులను పెట్టుబడిగా పెట్టారు.

అయితే, కొన్ని రోజుల పాటు చెప్పినట్లుగానే డిపాజిట్లు చెల్లించిన సంస్థ, ఆ తర్వాత ఉన్నపళంగా చెల్లింపులను నిలిపివేసింది. బాధితులు సంస్థ ప్రతినిధులను ప్రశ్నించగా సరైన సమాధానం రాకపోవడంతో తాము మోసపోయామని గ్రహించారు. దీనిపై ఓ బాధితురాలు గాజువాక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

ఈ స్కామ్‌కు సంబంధించి హార్వెంచర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (MD) పడాల సోమశేఖరరావును గాజువాక పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడికి చెందిన నివాసాల్లో పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మోసానికి సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీల పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కామ్‌లో మరికొందరి పాత్రపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>