8న హెల్త్ కమిషనరేట్ ముట్టడికి ఏఐటీయూసీ పిలుపు

కలం, నల్లగొండ: తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు విశేష ఆరోగ్య సేవలు అందిస్తున్న రెండో ఏఎన్ఎంల వేతనాలు పెంచి, వారికి వంద శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలని ఏఐటీయూసీ (AITUC) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం నల్లగొండ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాలయంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కెఎస్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి పనిచేస్తున్న రెండో ఏఎన్ఎంల వేతన పెంపు, ఉద్యోగాల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహిస్తోందని విమర్శించారు.

తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి..

గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అందరినీ పర్మినెంట్ చేసి, 100 శాతం గ్రాస్ వేతనం చెల్లించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని కెఎస్ రెడ్డి కోరారు. రెండో ఏఎన్ఎంలను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని, విధులు నిర్వహిస్తున్నవారికి రూ.10 లక్షల ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం ఈ నెల 8వ తేదీన హైదరాబాద్‌లోని హెల్త్ కమిషనరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించి ముట్టడిస్తామని ప్రకటించారు. నాయకులు నాగమణి, భాగ్యలక్ష్మి, శాంతా, వెంకటమ్మ, నరసమ్మ, పద్మ, ఎం.నందం, కె.నారాయణ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>