దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఉద్యమం.. అదొక్కటే డిమాండ్!

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ (Congress Party) దేశ వ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతోంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) రాజీనామాకు ససేమిరా అనడంతో మరింత ఒత్తిడి పెంచాలని భావిస్తోంది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యమానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రకటించారు.

అక్టోబర్ 2 నుంచి 8 వరకు ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ మార్చ్, అక్టోబర్ 10 నుంచి 20వ తేదీ వరకు ఓట్ బచావో, దేశ్ బచావో ప్రచారం చేస్తారు. అక్టోబర్ 25 నుంచి నవంబర్ రెండో తేదీ వరకు దేశ వ్యాప్తంగా తొలగించిన 13.13 కోట్ల మంది ఓటర్లను ప్రతి గ్రామంలో గుర్తించే కార్యక్రమం నిర్వహించబోతున్నారు. నవంబర్ ఒకటో తేదీన దేశ రాజధాని ఢిల్లీలో భారీ ర్యాలీ చేపడుతారు. నవంబర్ 25, 26వ తేదీల్లో చలో ఢిల్లీ మార్చ్ చేపట్టి, రాజధానిని దిగ్బంధిస్తారు.

జ్ఞానేష్ కుమార్‌ను అంగీకరించబోం..

జ్ఞానేష్ కుమార్‌ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవిలో ఒక్క క్షణం కూడా కూర్చునేందుకు అర్హుడు కాని వ్యక్తని కాంగ్రెస్ పార్టీ (Congress Party) జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఎన్నికల సంఘం చీటింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాగా మారిపోయిందన్నారు. అన్ని రాష్ట్రాల్లోని పీసీసీ అధ్యక్షులు, ఇన్‌ఛార్జులకు ఎలా ఆందోళన చేయాలో ఇప్పటికే స్పష్టమైనా ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. ఇది ఒకట్రెండు రోజులకు పరిమతయ్యే ఉద్యమం కాదని, సీఈసీ రాజీనామా చేసేవరకు కొనసాగించాలని రాహుల్ గాంధీ కూడా దిశానిర్దేశం చేసినట్లు పేర్కొన్నారు. జ్ఞానేష్ కుమార్‌ను తొలగించి, వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు.

Also Read : సర్ వివాదం.. కాంగ్రెస్ మూడు డిమాండ్లు ఇవే!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>