నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం

కలం, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా నార్సింగి (Narsingi) మండల పరిధిలోని జాతీయ రహదారి–44పై కాస్లాపూర్ వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. ఒక‌ హోండా యాక్టీశా ద్విచక్ర వాహనాన్ని ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఓ మహిళపై నుంచి బస్సు వెళ్లడంతో ఆమె తలకు తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా మారి అక్కడే ప్రాణాలు కోల్పోయింది.మరో వ్యక్తి కూడా ప్రమాదంలో తీవ్ర గాయాల‌పాలై మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను పరిశీలించారు. మృతదేహాలను రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, మృతుల వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>