కలం, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని మెహిదీపట్నం జీహెచ్ఎంసీ (GHMC) కార్యాలయంలో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB Telangana) అధికారులు నిర్వహించిన మెరుపు దాడి సంచలనం సృష్టించింది. భవన నిర్మాణ అనుమతుల కోసం భారీగా ముడుపులు డిమాండ్ చేసిన టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ సునీత (Town Planning Supervisor Sunitha )రూ.4 లక్షల నగదును లంచంగా తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు అత్యంత పకడ్బందీగా ఈ ట్రాప్ నిర్వహించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆకస్మిక దాడితో జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఒక్కసారిగా అలజడి ఏర్పడింది. అధికారులు ఆఫీస్‌లో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

