సీఎం రేవంత్‌పై అభ్యంతరకర పోస్టులు.. డీజీపీకి ఫిర్యాదు

కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియాలో కొందరు అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ (MLC Balmoor Venkat) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీలోని ఒక నటితో ముడిపెడుతూ.. విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సదరు పోస్టులు పెట్టినవారిపై వెంటనే విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్‌కు ఫిర్యాదు చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవానికి భంగం కలిగించేలా.. అత్యంత అసభ్యకర పోస్టులు, కామెంట్స్ చేస్తున్నారని బల్మూర్ వెంకట్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా పోస్ట్ చేస్తున్న అకౌంట్లు వెరిఫైడ్ కాదని, ఎవరో కావాలనే ఫేక్ అకౌంట్లు క్రియేట్‌ చేసి పెడుతున్నారని తెలిపారు. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నవారిని వెంటనే గుర్తించి, కఠిన చర్యలు తీసుకునేలా సైబర్ క్రైం పోలీసులకు ఆదేశాలివ్వాలని కోరారు. స్పందించిన డీజీపీ దర్యాప్తు చేపడుతామని హామీ ఇచ్చారు.

పోస్టుల వెనుక బీఆర్ఎస్ నేతలు..

సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక బీఆర్ఎస్ నేతలు ఇలాంటి పోస్టులు పెట్టిస్తున్నారని బల్మూర్ వెంకట్ విమర్శించారు. సీఎంకు ఎవరితో సంబంధాలున్నాయంటూ ఇష్టమొచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా హద్దులు దాటిపోతోందని.. తమ సోషల్ మీడియా కూడా ఎంతో బలంగా ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కేటీఆర్ ఇకనైనా ఇలాంటివి చేయించడం మానుకోకపోతే.. ఆయన పదేళ్ల పాలనలో ఏం చేశారో వ్యక్తిగత వివరాలను కూడా సోషల్ మీడియాలో పెడుతామని హెచ్చరించారు. ఇలాంటి పోస్టులు పెడుతున్న వారి ఇళ్లల్లో అక్కాచెల్లెళ్లు, ఆడవాళ్లు లేరా..? ఇంత దారుణంగా పోస్టులు పెడుతారా..? అంటూ ఫైర్ అయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>