కలం, కరీంనగర్ : అక్టోబర్ 2 నుండి 8 వరకు “ప్రజాస్వామ్య పరిరక్షణ వారం” లో భాగంగా, సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు సోమవారం కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో ఇండి కూటమి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషన్ లో జరుగుతున్న అవకతవకలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా కరీంనగర్ (Karimnagar) లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని మేడిపల్లి సత్యం పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయాలన్నారు. ఇందిరా గాంధీ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు మన పార్టీల జండాలు ప్రదర్శిస్తూ, ముందు ఒక ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ భారీ మార్చ్ నిర్వహించి, అనంతరం కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వాలని అని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, సీపీఎం జిల్లా కార్యదర్శి వాసుదేవ రెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు తేజ్ దీప్ రెడ్డి, సీపీఐ ఎంఎల్ (మాస్ లైన్) జిల్లా కార్యదర్శి జిన్నం ప్రసాద్, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్, జిల్లా కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నా రెడ్డి, ముత్యం శంకర్, ఎస్.టి సెల్ అధ్యక్షులు శ్రావణ్ నాయక్, ఏఐఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్, సీపీఐ నగర నాయకులు అంజన్న తదితరులు పాల్గొన్నారు.

