మలేరియా, డెంగ్యూపై యుద్ధం.. RDT పరీక్షలు ముమ్మరం!

​కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem )జిల్లాలో మలేరియా, డెంగ్యూ వ్యాధుల నిర్మూలనకు క్షేత్రస్థాయి నిఘాను తీవ్రతరం చేసినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ (Tukaram Rathod) తెలిపారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని జిల్లా ఉప వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అనుమానిత జ్వర బాధితులకు ఫీల్డ్ స్థాయిలోనే తక్షణమే ర్యాపిడ్ డ‌యోగ్నోటిక్ పరీక్షలు నిర్వహించి, వేగంగా చికిత్స అందించాలని సిబ్బందిని ఆదేశించారు.

​జిల్లాలోని ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షా కిట్ల కొరత లేకుండా T-HUB వాహనాల ద్వారా అవసరమైన చోట్లకు త్వరితగతిన తరలించి పంపిణీ చేయాలన్నారు. జ్వర సర్వేలు, కేస్ ఫాలోఅప్ పటిష్టంగా నిర్వహించాలని, ప్రజారోగ్యం విషయంలో సిబ్బంది అలసత్వం వహించవద్దని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ DMHO డాక్టర్ ఎం. శ్రీధర్, అసిస్టెంట్ మలేరియా అధికారి రవి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>