ఉద్యోగార్థుల ఆశలపై నీళ్లు చల్లిన కాంగ్రెస్: రాకేష్ రెడ్డి

కలం, ఖమ్మం బ్యూరో: ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా కనీసం 10 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి (Anugula Rakesh Reddy) విమర్శించారు. కాంగ్రెస్ ప్రకటించిన ‘యూత్ డిక్లరేషన్’ దిక్కులేకుండా పోయిందని, వారి ‘జాబ్ క్యాలెండర్’ కాస్తా ‘జాబ్‌లెస్ క్యాలెండర్’గా మారి ఉద్యోగార్థుల ఆశలపై నీళ్లు చల్లిందని దుయ్యబట్టారు. ​సోమవారం ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులను, అనంతరం సెంట్రల్ లైబ్రరీలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులను ఆయన కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 20 వేల పోలీస్ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 7 వేల పోస్టులకే ప్రభుత్వం అనుమతి ఇవ్వడం అత్యంత విచారకరమన్నారు.

సర్దార్ పటేల్ స్టేడియంలో పోలీస్ అభ్యర్థులు ప్రాక్టీస్ కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, లాంగ్ జంప్ కోసం అవసరమైన ఇసుకను వెంటనే ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే దేహదారుఢ్య పరీక్షల్లో ఉన్న అశాస్త్రీయ విధానాలు, లాంగ్ జంప్ నిబంధనలపై అధ్యయనం చేసి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ​పరిస్థితి ఇలాగే ఉంటే ఏళ్లుగా కోచింగ్ సెంటర్లు, లైబ్రరీలకే పరిమితమైన యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ప్రతి నిరుద్యోగికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన గ్రాడ్యుయేట్లు ప్రతి ఒక్కరూ ఫారం-18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. అలాగే రాబోయే నెలల్లో జరగనున్న ఆర్మీ రిక్రూట్‌‌మెంట్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు రాకేష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>