మంత్రుల కార్యక్రమానికి మహేశ్వర్ రెడ్డి డుమ్మా.. నిర్మల్‌లో హాట్ టాపిక్!

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో సోమవారం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. జిల్లా కలెక్టరేట్‌లో నిర్మల్, ఖానాపూర్, ముధోల్ నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి పనులకు మంత్రులు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హాజరయ్యారు.

అయితే నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (MLA Alleti Maheshwar Reddy) గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల 22-ఏ నిషేధిత భూముల వ్యవహారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన మంత్రుల కార్యక్రమానికి హాజరు కాలేదనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపించింది.

అయితే ఎమ్మెల్యే గైర్హాజరుకు అధికారికంగా ఎలాంటి కారణం వెల్లడికాలేదు. జిల్లాలోని ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనగా, నిర్మల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాత్రం దూరంగా ఉంటూ.. అభివృద్ధి కార్యక్రమాల కంటే రాజకీయ కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>