కలం, వెబ్‌డెస్క్: వైద్యశాస్త్రంలో 2026 సంవత్సరానికి ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతుల (Nobel Prize) విజేతలను అధికారికంగా వెల్లడించారు. కార్ల్ డైసర్రోత్, పీటర్ హెగెమాన్, జార్జ్ నాగెల్‌లు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. కాంతి-నియంత్రిత అయాన్ ఛానెల్స్, ఆప్టోజెనెటిక్స్ రంగంలో వారి ఆవిష్కరణలకు గాను ఈ పురస్కారం లభించినట్లు నోబెల్ ప్రతినిధులు వెల్లడించారు. స్టాక్‌హోమ్‌లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లో నోబెల్ అసెంబ్లీ ఈ ప్రకటన చేసింది. అక్టోబర్ 12 వరకు వివిధ విభాగాలలో నోబెల్ పురస్కారాల విజేతలను ప్రకటించనున్నారు.
విజేతలకు గోల్డ్ మెడల్, డిప్లొమాతో పాటు 12 మిలియన్ల స్వీడిష్ క్రోనార్ల నగదు బహుమతి లభిస్తుంది. డిసెంబర్ నెలలో జరిగే అధికారిక వేడుకల్లో ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ప్రకారం వైద్యశాస్త్రం ఆయనకు అత్యంత ఇష్టమైన రంగాలలో ఒకటి. ఈ ఏడాది వైద్యశాస్త్రంతో ప్రారంభమైన ఈ నోబెల్ పురస్కార ప్రకటనలు రానున్న రోజుల్లో సైన్స్, సాహిత్యం, శాంతి, ఆర్థిక శాస్త్ర విభాగాలకు కొనసాగనున్నాయి.

