కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి (Thimmareddypally) గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కోలా సతయ్య రోడ్డు దాటుతుండగా, సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఆయనను బలమైన వేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సతయ్య తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

