ఆధునిక సాంకేతికతతోనే రైతులకు అధిక ఆదాయం: వేముల వీరేశం

కలం, నకిరేకల్ : వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక (Modern Farming Technology) పరిజ్ఞానాన్ని ఉపయోగించి, సాగు వ్యయాన్ని తగ్గించుకుంటూ మెరుగైన దిగుబడులు సాధించినప్పుడే రైతుల ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.

నకిరేకల్ పట్టణంలోని కమల్ గార్డెన్స్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆత్మ’ –ఆర్‌పీఎల్‌ ఆధారిత శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేముల వీరేశం (Vemula Veeresham) మాట్లాడుతూ… వ్యవసాయంలో వస్తున్న నూతన మార్పులు, ఆధునిక సాగు పద్ధతులు, నైపుణ్యాభివృద్ధిపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణను నిరంతరం అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు. ఈ రకమైన నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, శిక్షణా సిబ్బంది, రైతు సోదరులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read : సీఎం రేవంత్, సినీ నటిపై అసభ్యకర పోస్టులు.. సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు..!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>