బీజేపీ గిరిజన మోర్చా అధికార ప్రతినిధిగా తిరుపతి నాయక్

కలం, వెబ్ డెస్క్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర గిరిజన మోర్చా (BJP ST Morcha) రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గుగులోతు తిరుపతి నాయక్ (Thirupathi Naik) నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు నేనావత్ రవి నాయక్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా తిరుపతి నాయక్ మాట్లాడుతూ.. తమ పార్టీ నేతలు బండి సంజయ్, రాంచందర్ రావుల సూచనల మేరకు తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు నేనావత్ రవి నాయక్ కు, సహకరించిన బిజెపి నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా, గిరిజన తండాలు గూడేలు ఎదుర్కొంటున్న సమస్యలపై.. అలాగే బీజేపీ ఎస్టీ మోర్చా బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తిరుపతి తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం గిరిజనుల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తానని తిరుపతి నాయక్ (Thirupathi Naik) చెప్పారు. భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమిస్తూ, పార్టీ అప్పగించిన బాధ్యతలను సర్థకతతో నిర్వహిస్తానని పునరుద్ఘాటించారు.

Also Read : పథకాల వేట.. మారిన భారత్ వ్యూహం!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>