కలం, వెబ్ డెస్క్: ఏపీలో త్వరలో నిర్మాణం కానున్న భారీ ప్రాజెక్టు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) రిఫైనరీ ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతులు మంజూరు అయ్యాయి. రూ. 96,862 కోట్లకు పైగా వ్యయంతో రామాయపట్నం పోర్ట్ సమీపంలో 5,200 ఎకరాల విస్తీర్ణంలో బీపీసీఎల్ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు కానున్నాయి.
ఏడాదికి 9-12 మిలియన్ మెట్రిక్ టన్నుల (9 MTPA) సామర్థ్యంతో పెట్రోల్, డీజిల్, పెట్రోకెమికల్ ఉత్పత్తుల తయారీ లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ప్రాజెక్ట్‌లో భాగంగా 30 శాతం అంటే 1563 ఎకరాల మేర గ్రీన్ బెల్ట్ అభివృద్ధికి బీపీసీఎల్ ప్రణాళిక రచించింది. దాదాపు రూ. లక్ష కోట్లతో నిర్మాణం కాబోతున్న ఈ ప్రాజెక్టును 2030 ఆర్థిక సంవత్సరానికల్లా పూర్తి చేయాలని కూటమి సర్కార్ భావిస్తోంది. ఈ భారీ పరిశ్రమతో వేల మందికి ఉపాధి లభించనుంది.

