మైనర్ల డ్రైవింగ్‌పై పోలీసుల ప్రత్యేక డ్రైవ్

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లాలో మైనర్లు వాహనాలు నడపడాన్ని నియంత్రించేందుకు ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు పోలీసులు (Nirmal Police) ఆదివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాలు, విద్యాసంస్థల పరిసరాల్లో వాహనాలను తనిఖీ చేసి డ్రైవింగ్ లైసెన్సులు, వాహన పత్రాలను పరిశీలించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులు, వాహన యజమానులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>