రేపు ఆర్డీఓ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లాలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని ఆర్డీఓ కార్యాలయంలో (పాత కలెక్టరేట్) నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) ఆదివారం తెలిపారు. రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యలు, వినతులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>