కరువును ఎదుర్కోవడంలో రేవంత్ సర్కార్ ఫెయిల్: కవిత

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కరువు పరిస్థితులు చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరువు తాండవం చేస్తోందన్నారు. భూగర్బ జలాలు కొన్ని చోట్ల 20 మీటర్ల లోతుకు పడిపోయాయని.. చాలా చోట్ల రైతన్నలు తమ పంటలు కాల్చుకుంటున్న పరిస్థితి చూస్తున్నామని చెప్పారు. జులై నెలలో 1 శాతం తక్కువ వర్షపాతం నమోదైతే.. ఆగస్ట్ లో 38, సెప్టెంబర్ లో 30 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని అన్నారు.

కరువు మండలాలను ప్రకటించాలి..

రాష్ట్రంలో కరువును ఎదుర్కోవడంలో రేవంత్ సర్కార్ ఫెయిల్ అయిందని కవిత మండిపడ్డారు. కనీసం కరువు మండలాలను కూడా గుర్తించలేని అచేతన స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్ తర్వాత కరువు మండలాలను ప్రకటిస్తారని భావించామాని.. కానీ అలా జరుగలేదన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కరవు మండలాలను ప్రకటించాయని చెప్పారు. కరువు మండలాలను ప్రకటిస్తే కేంద్రం నుంచి తమ ప్రభుత్వానికి సాయం అందే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కరువు మండలాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు.

కృష్ణాజలాలపై చర్యలు తీసుకోవడం లేదు..

తెలంగాణ హక్కు అయిన కృష్ణాజలాలను కాపాడుకునేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నీళ్లను మహబూబ్ నగర్ నుంచి ఏపీలోని కుప్పంకు తరలిస్తున్నా..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఇప్పుడేమో కర్ణాటకను అడిగి నీళ్లు తెస్తున్నామని కాంగ్రెస్ నేతలు బిల్డప్ ఇస్తున్నారని విమర్శించారు. ఓ పక్క బిల్డప్ లు ఇస్తూనే మరోపక్క చంద్రబాబుకు నీళ్లను గిప్ట్ ప్యాక్ చేసి పంపిస్తున్నారని ఆరోపించారు.

కరువుపై టీఆర్ఎస్ ప్రత్యేక కార్యాచరణ..

రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలను ప్రభుత్వానికి తెలిపేందుకు టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంఛార్జ్ లు ప్రతి గ్రామానికి వెళ్తారని కవిత వెల్లడించారు. కరువు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపేందుకు తాము ప్రత్యేక కార్యాచరణ చేపడతామని స్పష్టం చేశారు.రైతుల పక్షాన తెలంగాణ రక్షణ సేన నిలబడుతుందని.. వారికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

కార్యాచరణ సిద్ధం చేయాలి..

రానున్న రోజుల్లో ఎండలు కూడా విపరీతంగా పెరిగే పరిస్థితి ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారని కవిత తెలిపారు. ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే ప్రత్యేక కేబినెట్ ఏర్పాటు చేసి కరువు, రైతు సమస్యలను తీర్చాలన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>