రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్ రాజర్షి షా

కలం, ఆదిలాబాద్: సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన జిల్లా ప్రజావాణి (Prajavani) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) ఆదివారం తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం నిర్మల్ జిల్లాలో నిర్వహించనున్న సమావేశానికి జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు. అయితే, మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యలు, వినతులను ఆయా మండలాల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాల్లో సంబంధిత అధికారులకు సమర్పించి పరిష్కారం పొందవచ్చని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>