అంబులెన్స్‌లోనే బిడ్డకు జన్మనిచ్చిన గర్భిణి

కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి జిల్లా లింగంపేట్ (Lingampet) మండలం పోతాయిపల్లి గ్రామానికి చెందిన ఓ గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ ఈఎంటీ అనిల్, పైలట్ రోహిత్ తక్షణమే స్పందించి బాధితురాలిని ఆసుపత్రికి తరలించేందుకు బయలుదేరారు.

మార్గమధ్యలో నొప్పులు తీవ్రం కావడంతో సిబ్బంది అంబులెన్స్‌లోనే కాన్పు నిర్వహించారు. ఆ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. అనంతరం తల్లిని, నవజాత శిశువును కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>