సీఈసీ రాజీనామా చేయాలి.. ప్రకాశ్ రాజ్ సంచలన డిమాండ్

కలం, వెబ్ డెస్క్ : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని, ఎన్నికల సంఘం చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ ప్రక్రియను రద్దు చేయాలని ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ (Prakash Raj) డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ‘సర్’ ప్రక్రియపై ప్రకాశ్ రాజ్ సంచలన ఆరోపణలు చేశారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో ప్రజాస్వామ్యాన్ని, పౌరుల ప్రాథమిక హక్కులను అణచివేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.

ఓటర్ల జాబితాలో ఎవరి ఓట్లు ఉంచాలనేదానిపై బీజేపీ ఆఫీసు నుంచి లిస్ట్ వెళ్తోందని ప్రకాశ్ రాజ్ (Prakash Raj) అన్నారు. ఆ పార్టీ అనుకూల ఓట్లు మాత్రమే ఉంటున్నాయని పేర్కొన్నారు. బతికుండగానే తమ ఓట్లు తొలగించారని కొందరు వాపోతున్నారని వ్యాఖ్యానించారు. అక్రమ చొరబాటుదారులంటే ఇన్నేళ్లుగా ఏం చేశారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ క్రమంలోనే ‘సర్’ ప్రక్రియ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ తన పదవికి రాజీనామాకు చేయాలని డిమాండ్ చేశారు.

Also Read : పైలట్ స్మిత్ మచ్ఛర్‌కు రూ.కోటి నజరానా

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>