నల్లగొండలో జర్నలిస్టులకు ఏఐ, సోషల్ మీడియాపై శిక్షణ

కలం, నల్లగొండ : మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిస్టులు (Journalists) ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో తెలంగాణ మీడియా అకాడమీ, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్( IJU) నల్లగొండ జిల్లా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో “ఏఐ ( Artificial Intelligence), సోషల్ మీడియా” అంశాలపై ప్రత్యేక అవగాహన సెమినార్, వర్క్‌షాప్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కె. శ్రీనివాస్ రెడ్డి (K. Srinivas Reddy) మాట్లాడుతూ .. జర్నలిజంలో ఏఐ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించడం వల్ల వార్తల నాణ్యతతో పాటు పనివేగం పెరుగుతుందన్నారు. వార్తల తయారీ, సమాచార విశ్లేషణ, సోషల్ మీడియా కంటెంట్ రూపకల్పనలో ఏఐ సాధనాల పాత్రపై నిపుణులు జర్నలిస్టులకు ప్రత్యక్ష శిక్షణ ఇచ్చారు.

అదేవిధంగా సోషల్ మీడియాలో వ్యాపించే తప్పుడు సమాచారాన్ని (ఫేక్ న్యూస్) గుర్తించే విధానాలు, నిజానిజాలు నిర్ధారించుకునే మెళకువలపై స్పష్టమైన అవగాహన కల్పించారు.  ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ కలెక్టర్ ప్రేమకరణ్ రెడ్డి, జిల్లా పౌరసంబంధాల అధికారి వెంకటేశ్వర్లు, ఐజేయూ జిల్లా కార్యదర్శి గార్లపాటి కృష్ణారెడ్డితో పాటు జిల్లాకు చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా స్టాఫర్లు, నియోజకవర్గ ఇన్చార్జిలు, వీడియో జర్నలిస్టులు, విలేకరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>