ప్రీతి ముండేను యువతులు ఆదర్శంగా తీసుకోవాలి: కలెక్టర్ రాజర్షిషా

కలం, ఆదిలాబాద్: మారుమూల గ్రామం నుంచి వచ్చి జాతీయ స్థాయిలో ‘మిస్ ఎర్త్ వాటర్ ఇండియా – 2026’ కిరీటాన్ని సాధించిన ప్రీతి ముండే (Preethi Munde) జిల్లా కీర్తిని చాటారని కలెక్టర్ రాజర్షిషా (Rajarshi Shah) అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీ గోడం నగేష్, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనుషాతో కలిసి ప్రీతి ముండే, ఆమె తల్లిదండ్రులు ఉమ, ప్రహ్లాద్‌లను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యువతులు ప్రీతిని ఆదర్శంగా తీసుకుని తమ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు. పట్టుదలతో ముందుకు సాగితే విజయం సాధ్యమన్నారు. ఇంద్రవెల్లి మండలం హిరాపూర్‌కు చెందిన ప్రీతి జాతీయ స్థాయిలో జిల్లా పేరును నిలబెట్టడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, హిరాపూర్ గ్రామస్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>