కలం, వెబ్డెస్క్: జపాన్లోని ఐచి నాగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలను (Asian Games) తెలంగాణ ప్రభుత్వ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) నేతృత్వంలోని ప్రతినిధి బృందం రెండో రోజు సందర్శించింది. ఈ పర్యటనలో మంత్రి శ్రీహరితో పాటు ప్రభుత్వ ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ శివసేన రెడ్డి, వీసీ, ఎండీ సోనీ బాలాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెపక్ తక్రా విభాగంలో భారత్ కాంస్య పతకం సాధించడం పట్ల బృందం హర్షం వ్యక్తం చేసింది. భారత్ మాతా కీ జై.. జై భీమ్ నినాదాలతో క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు.
తెలంగాణలో క్రీడారంగాన్ని మరింత అభివృద్ధి చేయడం, యువ క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పర్యటనను చేపట్టింది. ఈ అంతర్జాతీయ క్రీడా పోటీలు, వాటి నిర్వహణ సరళిని ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా పొందిన అనుభవాలు రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ఎంతో దోహదపడతాయని మంత్రి శ్రీహరి ఆశాభావం వ్యక్తం చేశారు.

