కలం, వెబ్ డెస్క్: ఢిల్లీ, ముంబయి నగరాల్లో నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రంగా తప్పుబట్టారు. ఆందోళనకారులను రోడ్లపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ రోజు గాంధీ జయంతి. వేలాది మంది యువత తమ ఓటు చోరీ అవుతోందని శాంతియుతంగా, అహింస పద్ధతుల్లో, రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకే నిరసన తెలిపేందుకు రోడ్లపైకి వచ్చారు.
జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) రాజీనామా చేసి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నదే వారి ప్రధాన డిమాండ్. కానీ, మోదీ–అమిత్ షా ప్రభుత్వం ఏం చేస్తోంది? ఓటు చోరీ అవుతోందని ప్రశ్నించడమే నేరమా..? జ్ఞానేష్ కుమార్ దిగిపోవాల్సిందే.. అతడిని పెట్టుకున్న వ్యవస్థ కూడా దిగిపోవాల్సిందే’ అని పోస్ట్ చేశారు.
జంతర్ మంతర్ దగ్గర ఖాళీ..
ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర పోలీసులు ఉదయం నుంచి పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. వచ్చినవారిని వచ్చినట్లే వ్యాన్లలో ఎక్కించి వివిధ ప్రాంతాలకు తరలించారు. ఇలా ఇప్పటివరకు సుమారు వెయ్యి మందికి పైగానే నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. జులైలో జరిగిన ఆందోళనల నేపథ్యంలో పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళనలు పెద్దవి కాకుండా చర్యలు తీసుకున్నారు. ముందస్తుగానే ఆ ప్రాంతంలో కొన్ని గంటల పాటు ఇంటర్నెట్ కనెక్షన్ తొలగించారు. మెట్రో రైళ్లను నిలిపేసి.. ఎవరూ రాకుండా అడ్డుకున్నారు. దీంతో జంతర్ మంతర్ దగ్గర ఖాళీ అయినట్లు కనిపిస్తోంది.
Also Read : యాదగిరిగుట్ట భక్తుల ప్రసాదానికి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్
Follow Us On: X(Twitter)

