యూపీలో అమాన‌వీయ ఘ‌ట‌న‌.. రోడ్డుపై మ‌హిళ ప్ర‌స‌వం!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని భ‌దోహి (Bhadohi)జిల్లాలో అమాన‌వీయ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్ర‌భుత్వ‌ ఆస్ప‌త్రి (Govt Hospital) నిర్ల‌క్ష్యంతో ఓ మ‌హిళ ఆస్ప‌త్రి ముందే రోడ్డు ప‌క్క‌న ప్ర‌స‌వించింది. వివ‌రాల్లోకి వెళ్తే.. రాణి వన‌వాసి (Rani Vanvasi) అనే మ‌హిళ‌కు పురిటి నొప్పులు రావ‌డంతో కుటుంబ‌స‌భ్యులు స్థానిక ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. ఆమెకు వైద్యం అందించడంలో డాక్ట‌ర్లు తీవ్ర నిర్లక్ష్యం వ‌హించారు. వనవాసికి రక్తహీనత ఉందని, రక్తం సర్దుబాటు కాలేదని చెప్తూ ఆసుపత్రి సిబ్బంది ఆమెను అక్క‌డ‌ చేర్చుకోలేదు. కుటుంబసభ్యులు దుప్పట్లు అడ్డుగా పట్టుకొని నిలబడితే వనవాసి మంగళవారం రాత్రి ఆసుపత్రి బయట రోడ్డు పక్కనే బిడ్డకు జన్మనిచ్చింది.

ఈ ఘటనపై విచారణ జరిపిన త్రిసభ్య బృందం నివేదిక సమర్పించింది. దీంతో నలుగురు డాక్ట‌ర్లు, ఒక స్టాఫ్ నర్సును ఉన్న‌తాధికారులు దోషులుగా తేల్చారు. ఈ దారుణ ఘటనపై స్థానిక కాంగ్రెస్ నేత‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆమె ముసహర్ షెడ్యూల్డ్ తెగకు చెందిన మహిళ కావడంతోనే కులవివక్ష కారణంగా వైద్యం నిరాకరించారని ఆరోపిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో దళితులు, ఆదివాసీల పట్ల వైఖరి ఇలానే ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు వనవాసి ప్రసవం జరుగుతుండగా రోడ్డు పక్క నుంచి వెళ్లే ఓ వ్యక్తి తీసిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. దీంతో ఆస్పత్రి (Bhadohi Hospital) సిబ్బంది తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోనే ఉన్నా.. సర్వోత్తమ్ రెడ్డి క్లారిటీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>