గాంధీజీ ఆశయాలే దేశానికి స్ఫూర్తి: మేడిపల్లి సత్యం

కలం, కరీంనగర్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని కార్ఖానగడ్డ(Karkhanagadda) గాంధీ విగ్రహం వద్ద గురువారం కార్యక్రమం నిర్వహించారు. చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం (Medipally Sathyam) ముఖ్య అతిథిగా హాజరై, మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య తదితరులతో కలిసి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా డా. మేడిపల్లి సత్యం (Medipally Sathyam) మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా ప్రజల తరఫున జాతిపితకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. సత్యం, అహింస అనే మార్గాలతో మహాత్మా గాంధీ బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఎన్నో సంవత్సరాలు పోరాడారని అన్నారు. విదేశాల్లో బారిస్టర్ చదువుకున్న సమయంలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా పోరాడి, అదే స్ఫూర్తితో భారత్‌కు తిరిగి వచ్చి దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చారని పేర్కొన్నారు.చంపారన్ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి అనేక పోరాటాలకు గాంధీ నాయకత్వం వహించారని, ఆయన పోరాటాల ఫలితంగానే 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం వచ్చిందని తెలిపారు.

మహాత్మా గాంధీని వ్యతిరేకించే, ఆయనను హత్య చేసిన గాడ్సే వారసులు దేశాన్ని పరిపాలించడం దురదృష్టకరమని డా. మేడిపల్లి సత్యం వ్యాఖ్యానించారు. గాంధీ ఆనవాళ్లను లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్న వారి కలలు ఫలించవని అన్నారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు, భూమి ఆకాశం ఉన్నంత వరకు మహాత్మా గాంధీ పేరు దేశ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పురుమల్ల శ్రీనివాస్, కోమటిరెడ్డి పద్మకర్ రెడ్డి, వరాల నరసింగం, మల్లికార్జున రాజేందర్, గడ్డం విలాస్ రెడ్డి, కర్ర సత్య ప్రసన్నా రెడ్డి, పురం రాజేష్, లింగంపల్లి బాబు, కర్ర రాజశేఖర్, వెన్న రాజమల్లయ్య, కామ్ రెడ్డి రామ్ రెడ్డి, దిండిగాల మధు, కలువల రాంచందర్, కంకణాల అనిల్ కుమార్, సిరిపురం మనోజ్ కుమార్, గంగన్న, చందు, వంగల విద్యాసాగర్, ముక్క భాస్కర్, రోళ్ళ సతీష్, పొరండ్ల రమేష్, చాంద్ పాషా, మాదాసు శ్రీనివాస్, రజిత రెడ్డి, ప్రభాకర్, షబానా, హస్తపురం తిరుమల, మహాలక్ష్మి, దండి రవీందర్, మహేష్, జొన్నల రమేష్, షాహెన్షా తదితరులు పాల్గొన్నారు.

Also Read : ఆస్తి కోసం నాటకమాడి.. చివరికి సీన్ రివర్స్!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>