కలం, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. తరచూ విధులకు గైర్హాజరవుతున్న 70 మంది వైద్యులను (AP Doctors) శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించింది. వీరితో పాటు ఎన్ని సార్లు వార్నింగ్ ఇచ్చినా హాజరు కాని మరో 193 మంది వైద్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. మే నెలలోనే 51 మంది డాక్టర్లను తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా 70 మంది డాక్టర్లను డిస్మిస్ చేయడం చర్చనీయాంశంగా మారింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా వీరిపై చర్యలు తీసుకున్నట్లు వైద్యారోగ్య మంత్రి సత్య కుమార్ తెలిపారు. ప్రభుత్వ వైద్యులపై నిరంతరం నిఘా ఉంటుందని.. తరచూ గైర్హాజరయ్యేవారికి ఉద్యోగాల నుంచి ఉద్వాసన తప్పదని హెచ్చరించింది.
ఎన్నెన్నో కారణాలు..
వేటుకు గురైన ప్రభుత్వ డాక్టర్ల(AP Doctors)లో కొందరు కొన్ని నెలలుగా డ్యూటీలకు హాజరు కావడం లేదని నివేదికలో పేర్కొన్నారు. మరికొందరు డ్యూటీకి వచ్చిన సరైన పర్యవేక్షణ చేయకపోవడం, ఒకటి రెండు గంటలు ఆసుపత్రిలో ఉండి.. ప్రైవేటు ఆసుపత్రులు నడిపిస్తుండటం వంటివి చేస్తున్నారు. దీనిపై గతంలోనే సీఎం చంద్రబాబు కూడా హెచ్చరించినా.. మార్పు రాలేదు. దీంతో.. వీరినే శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించడమే మేలు అని నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం.. అందుకనుగుణంగా చర్యలు చేపట్టింది.
Also Read : బీసీ రిజర్వేషన్ల వివాదం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశం
Follow Us On: Youtube

