తులం బంగారం హామీని అమలు చేయాలి : ప్రభాకర్​ రెడ్డి

కలం, మెదక్ బ్యూరో : తులం బంగారం ఆ హామీ అమలుపై స్పష్టత ఇవ్వకుండా కళ్యాణ లక్ష్మి పథకం భవిష్యత్తుపై కాంగ్రెస్​ ప్రభుత్వం ఆందోళన కలిగిస్తోందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) అన్నారు. పేద కుటుంబాల ఆశలను రాజకీయ హామీలకే పరిమితం చేయకుండా, కళ్యాణ లక్ష్మి పథకాన్ని నిరంతరాయంగా అమలు చేస్తూ, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్​ చేశారు. కళ్యాణ లక్ష్మి పథకం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దుబ్బాకలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar) మాట్లాడుతూ.. కళ్యాణ లక్ష్మి పథకం తెలంగాణలోని లక్షలాది పేద కుటుంబాలకు అండగా నిలిచిందన్నారు. ఆడబిడ్డ పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదనే గొప్ప ఆలోచనతో కళ్యాణ లక్ష్మి పథకంని కేసీఆర్​ తీసుకొచ్చారని చెప్పారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు సుమారు 12.71 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరగా, రూ.11,130 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ఇది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదని, పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, తల్లిదండ్రుల కష్టానికి అండగా నిలిచిన సంక్షేమ కార్యక్రమమని ప్రభాకర్​ రెడ్డి వెల్లడించారు.

Also Read : మెట్రో-ఆర్టీసీ కామ‌న్ పాస్ వ‌చ్చేసింది!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>