జాతీయ జూనియర్ అథ్లెటిక్స్‌ మీట్‌కు వనపర్తి క్రీడాకారుల ఎంపిక

కలం, వనపర్తి: క్రీడల్లో వనపర్తి (Wanaparthy) జిల్లా కీర్తిని మరింత ఇనుమడింపజేయాలని జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వాకిటి శ్రీధర్‌ అన్నారు. నవంబరు 14 నుంచి 16 వరకు హైదరాబాద్‌ సదాశివపేటలోని కామ్‌కోల్‌ వోక్సెన్‌ యూనివర్సిటీలో జరగనున్న 20వ నేషనల్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ మీట్‌–2026కు వనపర్తి జిల్లా జట్టును ఎంపిక చేశారు. బుధవారం వనపర్తిలోని డాక్టర్‌ బాలకృష్ణయ్య స్టేడియం మైదానంలో జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఎంపిక పోటీలు నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన వాకిటి శ్రీధర్‌ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడల్లో పాల్గొనడమే ముఖ్యమని, గెలుపోటములు సహజమని, రెండింటినీ సమానంగా స్వీకరించి మరింత పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సహకరిస్తున్న విజ్ఞాన్‌ కళాశాల, వాగ్దేవి కళాశాల, బచపాన్‌ పాఠశాల, బండారు రఘు తదితర దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమానికి వనపర్తి సీఐ రత్నం, జిల్లా డీవైఎస్‌వో టి. సుధీర్‌కుమార్‌రెడ్డి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. జిల్లా (Wanaparthy) అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రెటరీ నందిమల్ల శ్రీకాంత్‌ మాట్లాడుతూ ఎంపికైన క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎంపిక కార్యక్రమంలో పీడీలు నందన్‌, జబ్బర్‌, మహేష్‌, పీఈటీలు బసవరాజ్‌, ఉమాశంకర్‌, అజయ్‌, పులేందర్‌, ప్రవీణ్‌, శోభ, మాలతి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>