కేంద్రం కీలక నిర్ణయం: వాహనాలకు కొత్త CAFE నిబంధనలు

కలం, వెబ్ డెస్క్ : భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రయాణికుల వాహనాల (ప్యాసింజర్ వెహికల్స్) కోసం కొత్త ‘కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ’ (CAFE) నిబంధనల (CAFE Norms)ను నోటిఫై చేసింది. ఈ నూతన నిబంధనలు 2027 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చి, 2032 మార్చి 31 వరకు అమలులో ఉంటాయి. దేశంలో తయారయ్యే అలాగే విదేశాల నుంచి దిగుమతి అయ్యే కొత్త ప్యాసింజర్ వాహనాలన్నింటికీ ఇవి వర్తిస్తాయి.

వాహన తయారీదారులు స్వచ్ఛమైన సాంకేతికతలు, ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఇతర వినూత్న పరిష్కారాలను స్వీకరించేందుకు ఈ నిబంధనలు వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడం సహా దేశ ఇంధన భద్రత, సుస్థిరత లక్ష్యాలను సాధించడమే ధ్యేయంగా ఈ ఫ్రేమ్‌వర్క్ రూపుదిద్దుకుంది. సోలార్ రిఫ్లెక్టివ్ పెయింట్స్, అడ్వాన్స్డ్ గ్లేజింగ్, అత్యాధునిక ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ వంటి నూతన సాంకేతికతల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఇంధన వినియోగాన్ని తగ్గించడం ఈ కొత్త మార్గదర్శకాల ముఖ్య ఉద్దేశం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>