కలం యాదగిరిగుట్ట: యాదాద్రి కలెక్టరేట్ (Yadadri Collectorate) సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఇంచార్జీ కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డితో వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన 83 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చినదరఖాస్తులను (Prajavani Petitions) సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఇంచార్జీ కలెక్టర్ భాస్కర్ రావు తెలిపారు.
అందులో రెవిన్యూ శాఖ 53, సర్వే ల్యాండ్స్ 9,డి ఆర్ డిఎ 5, మున్సిపాలిటీ 5, సివిల్ సప్లై 2, వ్యవసాయ, ఇరిగేషన్, ఉపాధి కల్పన, వైద్య ఆరోగ్య, ఎక్సజ్, మత్య, యం పి డి ఓ, హోసింగ్ శాఖలకు ఒక్కొకటి చొప్పున వచ్చాయని తెలియజేశారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పెండింగ్ లేకుండా ఎప్పటికపుడు డిస్పోస్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి జయమ్మ, డిప్యూటీ కలెక్టర్ కృతిక, జెడ్పీ సీఈఓ శోభా రాణి, జిల్లా గ్రామీణా అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, హౌసింగ్ పీడీ అలివేలు,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

