కలం, కరీంనగర్: జమాత్ ఎ ఇస్లామీ హింద్ (JIH) కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న “సీరత్ క్యాంపెయిన్ 2026″ నేరాలను అరికట్టేందుకు ఎంతగానో దోహదపడుతుందని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ఆధునిక సమాజంలో పెరుగుతున్న నేరాలు, మాదకద్రవ్యాల వ్యసనం, సైబర్ మోసాలు, మహిళలపై అఘాయిత్యాలను అరికట్టి, మానవీయ నైతిక విలువలను పెంపొందించాలనే లక్ష్యంతో దీనిని తీసుకొచ్చారని తెలిపారు.
ఎక్స్పోలో ఏర్పాటు చేసినటువంటి 50 రకాల స్టాల్స్ ను నరేందర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రవక్త ముహమ్మద్ (సల్ల ల్లాహు అలైహి వసల్లం) వారి ఆదర్శ జీవితం ద్వారా శాంతి, నైతికత, సమానత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం జమాతే ఇస్లామీ హింద్ విశేషంగా కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డిని జమాతే ఇస్లామి హింద్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.

