కేంద్రం సంచలన నిర్ణయం.. రేపు అన్ని బ్యాంకులు ఓపెన్!

కలం, వెబ్ డెస్క్ : యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఈ నెల 28 నుండి 30 వరకు మూడు రోజుల పాటు దేశవ్యాప్త బ్యాంకింగ్ సమ్మెకు (Bank Strike)  పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల సమ్మె కారణంగా బ్యాంక్ ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఆదివారం అంటే సెప్టెంబర్ 27న దేశంలోని అన్ని ప్రభుత్వ రంగా బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సాధారణ పనివేళల్లో తెరిచే ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వరుస సెలవుల వల్ల నగదు ఉపసంహరణలు, డిపాజిట్లు, చెక్కుల క్లియరింగ్ వంటి అత్యవసర లావాదేవీలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తన అధికారిక ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. బ్యాంకు కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకుని, తమ అత్యవసర బ్యాంకింగ్ పనులను ఆదివారమే పూర్తి చేసుకోవాలని సూచించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>