ఆ బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘానిదే: జగన్

​కలం, వెబ్ డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘంపై దేశ వ్యాప్తంగా ఎన్నో అభ్యంతరాలు, ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో వాటికి స్పష్టత ఇచ్చే బాధ్యత ఈసీదేనని వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) స్పష్టం చేశారు. ఆరోపణలు, ప్రత్యారోపణల కంటే.. ఎలాంటి అభ్యంతరాలు వచ్చాయి..? వాటిపై ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంది..? ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు, చేర్చడం ప్రక్రియలు ఎలా జరుగుతున్నాయనేది ప్రజలకు వివరించాలని సూచించారు. తద్వారా ప్రజల్లో విశ్వాసం పెరిగేలా చూడాలన్నారు.

చీఫ్​ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ల చట్టం–2023 అమల్లోకి వచ్చినప్పుడు వైసీపీ మద్దతు ఇచ్చిందని గుర్తు చేసిన జగన్.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ చట్టాన్ని మరోసారి సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం, అధికార పార్టీ ఈ విషయంలో మరింత చొరవ చూపాలన్నారు. అవసరమైతే చట్ట సవరణ చేయాలన్నారు. కమిటీలో ప్రధాని, ప్రధాన ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తి ఉండేలా సవరించాలన్నారు.

ఏపీలో అలా జరిగిందేమో..?

సర్ ప్రక్రియ విషయంలో తమకు కూడా అనుమానాలున్నాయని వైసీసీ అధినేత జగన్ పేర్కొన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందనేదే తమ అభిప్రాయమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తీరుపై ప్రతిపక్షంగా అభ్యంతరాలు తెలిపినా.. పట్టించుకోలేదన్నారు. తటస్థ వ్యవస్థ, వ్యక్తులతో ఎన్నికల సంఘంలో నియామక ప్రక్రియ చేపట్టడం ప్రజాస్వామ్యానికి ఎంతో మంచిదన్నారు. ఇది ఈసీపై ప్రజల్లో గౌరవం, విశ్వాసం పెంపొందిస్తుందన్నారు. పారదర్శకత, జవాబుదారీతనమే ఎన్నికల సంఘం ప్రాథమిక బాధ్యత అనే విషయాన్ని మర్చిపోవద్దని జగన్ సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>