కలం యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలో (Yadagirigutta) ఫ్లై ఓవర్ బ్రిడ్జి తొలగింపునకు గ్రీన్ సిగ్నల్ రావడంతో స్థానిక దుకాణదారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యని స్థానికులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనాలోచితంగా నిర్మించిన ఫ్లై ఓవర్‌ను తొలగిస్తానంటూ ఎన్నికల సమయంలో యాదగిరిగుట్ట ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు చర్యలు తీసుకోవడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. ఇప్పటికే బ్రిడ్జి తొలగింపునకు సంబంధించి అనుమతులు, చర్యలకు అనుమతి లభించిందని చెప్పారు. వారం రోజుల్లో బ్రిడ్జి కుదింపు పనులు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు. యాదగిరిగుట్ట అభివృద్ధి, భక్తులు, వ్యాపారుల సౌకర్యానికి అవసరమైన చర్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని బీర్ల అయిలయ్య అన్నారు.

