కలం, ములుగు: ములుగు మండలం ఖాసీందేవేట (Kasimdevipeta) గ్రామంలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. నీటి కుంటలో పడి అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. గ్రామానికి చెందిన అబ్దుల్ పాషా తన కుటుంబంతో కలిసి పొలంలో కలుపు తీసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన భార్య నమ్యాన్ (19), ఆసియా (10) నీటి కుంటలో పడిపోయారు. ఆలస్యంగా గమనించిన తల్లిదండ్రులు కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే ఇద్దరూ మృతి చెందారు. ఈ విషాద ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

