ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి బారులు తీరిన భక్తులు

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లో ప్రసిద్దిగాంచిన ఖైరతాబాద్ మహాగణపతి (Khairatabad Ganapati) ​దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో ఖైరతాబాద్ వినాయక సన్నిధికి భక్తులు అధికంగా చేరుకుంటున్నారు. మెట్రోతో పాటు భారీగా వాహనాలతో ఖైరతాబాద్ కు చేరుకొవడంతో దారులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. నగరంలో వర్షాలు కురవడంతో అటు ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతుంది.  ​ఈ ఒక్కరోజే లక్షకు మందికి పైగా దర్శించుకునే అవకాశం ఉన్నట్లు ఉత్సవ నిర్వాహకులు తెలిపారు.

అటు స్వామివారిని దర్శించుకున్నదుకు భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. గణపయ్య దర్శనానికి 2 కి.మీ మేర భక్తులు క్యూ కట్టారు. భారీ రద్దీ దృష్ట్యా వృద్ధులు, చిన్నారులు మహాగణపతి దర్శనానికి రావద్దని నిర్వాహకులు కోరారు. అటు గణపయ్యను మంత్రి పొన్నం ప్రభాకర్​ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బంది రాకుండా మండప పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక నిఘా, సీసీ కెమెరాల పర్యవేక్షణ, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బడా గణేష్ దర్శనం సెప్టెంబర్ 23 వరకు ఉంటుందని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్ తెలిపారు. స్వామివారి దర్శానికి సొంత వాహనాల్లో రావడం వలన ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని.. వీలైనంత మేరకు మెట్రో, MMTS, ఆర్టీసీ స్పెషల్ బస్సు లలో భక్తులు రావాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>