కలం, బైంసా: బైంసా (Bhainsa) పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హిందూవాహిని (Hindu Vahini) పూర్వ కార్యకర్తలు శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హిందూవాహిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సంయోజక్ రాజవర్ధన్ రెడ్డి, తెలంగాణ ప్రాంత హిందూవాహిని సంఘటన మంత్రి యాదిరెడ్డి, ప్రాంత సభ్యులు హరీష్ చంద్ర పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, హిందూ సమాజ ఐక్యత, సామాజిక సేవా కార్యక్రమాలపై పూర్వ కార్యకర్తలతో చర్చించారు. ఉత్సవాలను సమన్వయంతో నిర్వహించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు. అనంతరం గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూవాహిని పూర్వ కార్యకర్తలు పాల్గొన్నారు.

