కలం, వెబ్ డెస్క్: వరంగల్‌లో ఎయిర్పోర్ట్ నిర్మాణం కాబోతుండటంపై ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) సంతోషం వ్యక్తం చేశారు. ‘నా సొంతూరు వరంగల్‌కు ఎయిర్పోర్ట్ కల సాకారం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను రెండు పేర్లు సూచించాలనుకుంటున్నా. రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (RIA), కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (KIA). వీటిలో ఏది పెట్టినా వరంగల్‌కు ఉన్న ఘనమైన వారసత్వ, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని నమ్ముతున్నా’ అన్నారు.
డిసెంబరులో వరంగల్ విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఏం పేరు పెట్టాలో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన పోస్టుపై సందీప్ రెడ్డి వంగా స్పందించి రెండు పేర్లు సూచించారు. నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ సైతం ఒక పేరు సూచించారు. ‘రాణీ రుద్రమదేవి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్’ అని పెట్టాలన్నారు. ఎక్కువ మంది రాణీ రుద్రమ దేవి పేరునే సూచిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఏ పేరు పెట్టబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

