ఆసియా గేమ్స్: 5 కొత్త ఆటల్లో భారత్ పోరు!

కలం, స్పోర్ట్స్ : జపాన్‌లోని ఐచి-నాగోయాలో 2026 ఆసియా గేమ్స్ (Asian Games) అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సుమారు 11 వేల మంది అథ్లెట్లు ఈ క్రీడల్లో పాల్గొంటున్నారు. అథ్లెటిక్స్, హాకీ, క్రికెట్, కబడ్డీ వంటి సంప్రదాయ క్రీడలతో పాటు ఈసారి భారత్ 5 అరుదైన ఆటల్లోనూ పతకాలపై కన్నేసింది.

టెక్ బాల్: కర్వ్‌గా ఉండే బల్లపై కాళ్లు, తలతో ఫుట్‌బాల్‌ను అటుఇటు కొట్టే ఆట ఇది. హంగేరీలో మొదలైన ఈ ఆట 2026లోనే ఆసియా గేమ్స్‌లోకి వచ్చింది. భారత్ తరఫున మహమ్మద్ అనస్ ఇమ్రాన్ బేగ్, డెక్లాన్ మార్షల్ గొన్సాల్వేస్, క్విన్సీ డిసౌజా పోటీపడుతున్నారు.

కురాష్: ఇది సెంట్రల్ ఆసియాకు చెందిన నిలబడి చేసే కుస్తీ లాంటి ఆట. ప్రత్యర్థిని వెన్నుపై నేలకు పడేస్తే విజయం దక్కుతుంది. గతంలో ఈ ఆటలో భారత్ వెండి, కాంస్య పతకాలు సాధించింది. ఈసారి పురుషుల విభాగంలో విపిన్ కుమార్, విశాల్, యష్ కుమార్, మహిళల విభాగంలో పింకీ చౌహాన్, భారతి బల్హారా, సంగీత బల్హారా బరిలోకి దిగుతున్నారు.

సాఫ్ట్ టెన్నిస్: టెన్నిస్ లాగే ఉండే ఈ ఆటలో తేలికపాటి రబ్బరు బంతిని వాడతారు. జపాన్‌లో పుట్టిన ఈ క్రీడ 1994 నుంచి ఆసియా గేమ్స్‌లో ఉంది. భారత్ నుంచి యోగేష్ చౌదరి, ఓమ్ యాదవ్, జై మీనా, అనికేత్ చిరాగ్ పటేల్, ఆర్యన్ ఠాకూర్, ఆధ్య తివారి పోటీలో ఉన్నారు. భారత్ ఈ విభాగంలో తొలి పతకం కోసం చూస్తోంది.

సెపక్ తక్రా: వాలీబాల్ కోర్టులో కాళ్లతో ఫుట్‌బాల్ ఆడే క్రేజీ ఆట ఇది. చేతులు వాడకూడదు. గతంలో భారత్ ఈ ఆటలో రెండు కాంస్య పతకాలు గెలుచుకుంది. ఈసారి పురుషులు, మహిళల జట్లు పతకాల పోరుకు సిద్ధమయ్యాయి.

స్పోర్ట్ క్లైంబింగ్: కృత్రిమ గోడలను వేగంగా, నైపుణ్యంతో ఎక్కే ఆట ఇది. ఇందులో స్పీడ్, బోల్డర్, లీడ్ అనే రకాలు ఉన్నాయి. భారత్ నుంచి దీపు మల్లేష్, జోగా పూర్తీ ఈ క్రీడలో పాల్గొంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>