MBBS చదువుకు రూ. 1.29 లక్షల ఆర్థిక సాయం.. అండగా నిలిచిన MLA కవ్వంపల్లి

కలం, కరీంనగర్ బ్యూరో: నిరుపేద MBBS విద్యార్థిని వడ్డేపల్లి రహేల్‌కు టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (MLA Kavvampally Satyanarayana) ఆర్థిక చేయూత అందించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య విద్యను కొనసాగించలేనేమోనని ఆందోళన చెందుతున్న వరంగల్ జిల్లా చెన్నారెడ్డిపల్లి లేబర్ కాలనీకి చెందిన రహేల్ పరిస్థితి గురించి తెలుసుకున్న కవ్వంపల్లి వెంటనే స్పందించారు.

వైద్య విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలన్న రహేల్ సంకల్పానికి అండగా నిలిచిన ఆయన, ఎంబీబీఎస్ చదువు కోసం రూ.1 లక్షా 29,500 ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు శనివారం రహేల్ కుటుంబ సభ్యులను హైదరాబాద్‌కు పిలిపించి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకుల సమక్షంలో రూ.1,29,500 విలువైన రెండు చెక్కులను ఆమెకు అందజేశారు.

ఆర్థిక పరిస్థితులు చదువుకు అడ్డంకి కాకూడదు

ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితి రాకూడదన్నారు. ముఖ్యంగా వైద్య విద్య వంటి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు అవసరమైన సమయంలో ప్రజా ప్రతినిధులు, సేవా సంస్థలు, రాజకీయ నాయకులు తమ వంతు సహకారం అందించాలని సూచించారు.

రహేల్ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఎంబీబీఎస్ విద్యను కొనసాగించి వైద్యురాలిగా ఎదగాలని ఆకాంక్షించారు. ఆమె చదువుకు తన వంతు సహాయం కొనసాగిస్తానని స్పష్టం చేసిన కవ్వంపల్లి, అవసరమైన పూర్తి చదువు పుస్తకాల బాధ్యత కూడా తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. అదేవిధంగా టీపీసీసీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పోలేపక జీవన జ్యోతి కూడా రహేల్ ఎంబీబీఎస్ చదువుకు తన వంతుగా ఆర్థిక సాయం అందించారు.

కృతజ్ఞతలు తెలిపిన రహేల్ కుటుంబ సభ్యులు

తమ కుమార్తె వైద్య విద్యకు ఆర్థిక సాయం అందించి అండగా నిలిచిన కవ్వంపల్లి సత్యనారాయణకు రహేల్, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తన వంతు సహాయం అందించిన పోలేపక జీవన జ్యోతికి కూడా ధన్యవాదాలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>